న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 100 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 14,392 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 1,12,10,799 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి నుంచి 1,08,68,520 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరణాల సంఖ్య 1,57,756కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,84,523. ఇప్పటి వరకు 2,09,22,344 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm