హైదరాబాద్ : పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు రేపు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. వివిధ పన్ను ప్రతిపాదనలున్న ఆర్థిక బిల్లుతోపాటు 2020-21 సంవత్సరానికి గ్రాంట్ల కోసం వివిధ డిమాండ్లు పొందడమే ఈ సెషన్‌లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తప్పనిసరి ఎజెండాలతోపాటు ఈ సెషన్‌లో ఆమోదించడానికి వివిధ బిల్లులను ప్రభుత్వం జాబితా చేసింది. ఇందులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ (సవరణ) బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు వంటివి ఉన్నాయి. కాగా, రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8న ముగియనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm