హైదరాబాద్ : కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించగా, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఈ పెద్దమనిషికి బుద్ధి నేర్పండయ్యా! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. గడచిన ఆరేళ్లలో తెలంగాణ ప్రజల ద్వారా కేంద్రానికి రూ.2,72,926 కోట్ల ఆదాయం వెళ్లిందని, కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.1.40,329 కోట్లేనని కేటీఆర్ వెల్లడించారు. దీన్ని బట్టి ఎవరు ఎవరికి నిధులు ఎక్కువ ఇస్తున్నట్టు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ఆదాయమే ఎక్కువని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm