హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటి అషూ రెడ్డి మండిపడింది. పిచ్చి వార్తలు రాస్తే బాగోదంటూ హెచ్చరించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 'సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చూస్తున్నాను. అన్నీ పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. నేను ముందే చెప్పాను. పవన్ కల్యాణ్ గారంటే నాకు దేవుడు అని! నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్‌ను. కానీ నా అభిమానాన్ని తీసుకెళ్లి సోషల్ మీడియాలో వేరేలా చెత్త చెత్తగా రాస్తున్నారు. అదైతే మంచిది కాదు. పాజివిటీని వ్యాప్తి చేయాల్సిన వాళ్లే నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తూ వేరే వాళ్లను బద్నాం చేయడం సరి కాదు' దీనివల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు అభిమానులను కలవొచ్చా? లేదా? అని ఆలోచించుకునే స్టేజీలోకి పవన్ కల్యాణ్‌ను నెడుతున్నారు. ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దు. కానీ వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి పిచ్చిపిచ్చి రాతలు రాయకండి. ఎందుకంటే, నేను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఒక మనిషికి అభిమాని అంటే చచ్చేంతవరకు అభిమానిలాగే ఉంటారు. అంతే తప్ప అక్కడ ఇంకేమీ అవదు. కానీ మీ రాతల వల్ల ఉన్న పేరు నాశనం చేయొద్దు' అని కాస్త ఘాటుగానే స్పందించింది.
Mon Jan 19, 2015 06:51 pm