హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన వీరు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Mar,2021 07:04PM