హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాలసముద్రం కియా కార్ల అనుబంధ సంస్థ లోటస్ వద్ద 20 కూలీల గృహాలు దగ్ధమయ్యాయి. ఫైర్ స్టేషన్కు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm