హైదరాబాద్ : కేంద్రం తమకు నిధులు ఇవ్వడంలేదంటూ బీజేపీపై విమర్శలు చేసిన కేటీఆర్ వ్యాఖ్యలపై బండీ సంజయ్ ఘాటుగా స్పందించారు. కేంద్రం ఏమీ ఇవ్వడంలేదని కేటీఆర్ అంటున్నారని, అన్నీ ఇచ్చాక వీళ్లు పొడిచేది ఏమిటని అన్నారు. కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం ముందుకు కదిలే పరిస్థితి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక, 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ కు తోమాల సేవ చేస్తానని, నిరూపించకుంటే బడితె పూజ చేస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లను కూల్చుతామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని అన్నారు. ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. అలాంటి పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm