హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సేకరణ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ కోసం నోడల్ అధికారుల బృందాలను నియమిస్తూ ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దివ్యాంగులు, 80 ఏళ్ల వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్లు, కొవిడ్ అనుమతులు, పాజిటివ్ వ్యక్తుల ఇళ్లవద్ద నుంచి పోస్టల్ ఓట్లు సేకరించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 15 నియోజకవర్గాల్లో మొత్తం పోస్టల్ ఓట్లు 178 ఉన్నట్లు గుర్తించారు. దివ్యాంగుల ఓట్లను ఈ నెల 9న, సీనియర్ సిటీజన్ల ఓట్లను 10న, కొవిడ్ అనుమానితులు/పాజిటివ్ ఉన్నవారి నుంచి 11, 12వ తేదీల్లో పోస్టల్ ఓట్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm