హైదరాబాద్: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మహిళపై యాసిడ్ పోసినట్లు సమాచారం. కాలిన గాయాలతో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm