హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని మహముత్తారం మండలం జీలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కండెల సమ్మయ్య(55) అనే వ్యక్తి ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవ్‌పూర్ దవాఖానకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm