హైదరాబాద్ : ఏపీలో నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో పార్టీలు ప్రచారానికి ముగింపు పలికాయి. ఎల్లుండి (మార్చి 10)న పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 75 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ నిర్వహించడంలేదు.
Mon Jan 19, 2015 06:51 pm