జైపూర్: యువతీయువకుల్లో కలిగే ప్రేమపై సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రేమించడం తప్పని పెద్దలంటే.. ప్రేమ మా హక్కు అని యువత అంటుంటారు. ఈ వాదోపవాదాలు కాసేపు పక్కన పెడితే.. ప్రేమను ఒప్పుకోలేదని చంపడం లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మాత్రం కచ్చితంగా తప్పే. ఇలా చేసుకోవద్దని యువతకు ఎంత అవగాహన కలిగించే ప్రయత్నం చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతూనే ఉన్నాయి. తాజాగా.. రాజస్తాన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక యువతిని వరుసకు అన్నదమ్ములయ్యే ఇద్దరు యువకులు ప్రేమించారు. అయితే.. ఏమైందో తెలియదు గానీ ఆ ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుంది జిల్లాలోని కేశవ్‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్‌రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు. ఆ యువతిని ప్రాణంగా భావించారు. ఆ ఇద్దరిలో ఎవరి ప్రేమను ఆ యువతి అంగీకరించిందో లేక ఇద్దరూ వన్‌సైడ్ లవ్ చేశారో తెలియదు గానీ ఇద్దరూ ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. వారు ఇద్దరూ శరీరంపై ‘ఆషా’ అని పచ్బబొట్టు పొడిపించుకున్నారు. ఏమైందో ఏమో గానీ గుడ్ల గ్రామం సమీపంలోని రైలు పట్టాలపై ఆదివారం రాత్రి ఇద్దరూ శవాలై తేలారు. ఇద్దరి మొబైల్ ఫోన్లను పరిశీలించగా ఆ యువతి ఫొటోలే కనిపించాయి. ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి సదరు యువతి కనిపించకుండా పోయింది. మహేంద్ర, దేవ్‌రాజ్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని సీఆర్‌పీఎఫ్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 17 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 09 Mar,2021 07:01AM