అమరావతి: అన్నాడీఎంకే కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు తుదిదశకు చేరుకుంది. కూటమిలో పీఎంకేకు 23 స్థానాలు, బీజేపీకి 25 స్థానాలు కేటాయిం చగా, తమకు కూడా పీఎంకేకు సమానంగా 23 స్థానా లు కేటాయించాలని డీఎండీకే అన్నాడీఎంకేను డిమాండ్ చేస్తోంది. కానీ, 15 నుంచి 20 స్థానాలు ఇచ్చేందుకు ఆ పార్టీ తెలుపడంతో, 17 స్థానాలు కోరేందుకు డీఎండీకే నిర్ణయించింది. ఈ విషయమై చర్చించేందుకు మంగళ వారం జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించ నున్నా రు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ విడు దల చేసిన ప్రకటనలో, పార్టీకి విజయావకాశాలున్న స్థానాలు, ప్రచారశైలి తదితరాలపై చర్చించేందుకు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శు ల సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm