హైదరాబాద్: మన దగ్గర ఓ వైన్ షాప్‌కు రూ. ఐదు కోట్లో, పది కోట్లో పలికితే ఆశ్చర్యపోతాం. కానీ రాజస్థాన్‌లో ఓ వైన్‌షాప్ ఏకంగా రూ.510 కోట్లు పలికిందంటే నమ్ముతారా? అది కూడా రూ.72 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన వేలం ఈ స్థాయికి చేరిందంటే నమ్మశక్యం కాదు. ఈ మధ్యే రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం వైన్‌షాప్‌లను లాటరీలో కాకుండా వేలం వేయాలని నిర్ణయించారు. ఇది అక్కడి ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపించింది. అక్కడి హనుమాన్‌గఢ్ జిల్లా నోహర్‌లోని ఓ వైన్‌షాప్‌కు ఈ-వేలం వేశారు. కిందటిసారి లాటరీలో కేవలం రూ.65 లక్షలకే పోయిన ఈ వైన్‌షాప్ ఈసారి మాత్రం కళ్లు తిరిగే మొత్తాన్ని సొంతం చేసుకుంది.
ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ఈ-వేలం అర్ధరాత్రి 2 గంటలకు ముగిసింది. చివరికి రూ.510 కోట్ల ధర పలకడం విశేషం. కిరణ్ కన్వర్ అనే వ్యక్తి ఈ షాప్‌ను సొంతం చేసుకున్నట్లు ఎక్సైజ్ పాలసీ అడిషనల్ కమిషనర్ సీఆర్ దేవసి వెల్లడించారు. బేస్‌ప్రైస్ కంటే ఇది ఏకంగా 708 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మూడు రోజుల్లో ఈ బిడ్డింగ్ మొత్తంలో రెండు శాతాన్ని బిడ్డర్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అతడు చెల్లించలేకపోతే రూ.లక్ష డిపాజిట్‌ను తిరిగి ఇవ్వరు. చురు జిల్లాలోని ఓ వైన్ షాప్ రూ.11 కోట్లకు, జైపూర్‌లోని సాంగనర్ వైన్‌షాప్ రూ.8.91 కోట్లు పలికాయి. కిందటిసారి కేవలం రూ.65 లక్షలు పలికిన ఈ వైన్‌షాప్‌కు ఈసారి ఎందుకింత డిమాండ్? అక్కడ సడెన్‌గా తాగుబోతులు ఆ స్థాయిలో పెరిగిపోయారా? అదేమీ లేదు. ఇంత భారీ బిడ్ ఎందుకు దాఖలైందా అని ఆరా తీస్తే.. అది రెండు కుటుంబాల మధ్య వైరం వల్లే అని తేలింది. ఈ వైన్ షాప్ కోసం ప్రియాంకా కన్వర్ అనే మరో మహిళ కూడా పోటీ పడింది. ఈ ఇద్దరూ పోటా పోటీగా వెళ్లడంతో చివరికి అది రికార్డు ధర పలికింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 09 Mar,2021 10:38AM