న్యూఢిల్లీ: పెట్రో ధరలపై మళ్లీ పార్లమెంట్ భగ్గుమన్నది. ఇవాళ కూడా ఉభయసభల్లోనూ విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో ఇవాళ రెండు సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు పాత పద్ధతిలో సమావేశమైన విషయం తెలిసిందే. 11 గంటలకు ప్రారంభమైన ఉభయసభలు తొలుత 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. పెట్రో ధరల పెరుగుదల అంశంపై చర్చ చేపట్టాలని ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. దీంతో తొలుత 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత సమావేశమైన ఉభయసభల్లోనూ మళ్లీ అదే సీన్ రిపీటైంది. దీంతో లోక్‌సభను మీనాక్షి లేఖి, రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm