హైదరాబాద్: తక్కువ వడ్డీకే హోమ్ లోన్ తీసుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునేవారికి షాక్ ఇస్తున్నాయి బ్యాంకులు. క్రమంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుందంటేనే ఎన్నో సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తాయి బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు. ముఖ్యంగా వ్యక్తిగత, గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాంకుల తక్కువ వడ్డీకే లోన్లు అందిస్తాయి. ఇందులో భాగంగానే మార్చి నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలు తీసుకునేవారికి 6.7 శాతం వడ్డీకే రుణాలు మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ వడ్డీ రేటును మార్చింది. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి హోంలోన్లు తీసుకునే వారికి 6.95 శాతానికి అందిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31తో ఈ రాయితీ ఆఫర్ గడువు ముగిసినట్లు తెలియజేసింది. హోంలోన్ పోర్ట్ ఫోలియోలో ఎస్బీఐ రూ.50 వేల కోట్లతో అగ్రగామి బ్యాంకుగా విరాజిల్లుతూ మార్కెట్ లీడర్ గా దూసుకెళ్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ కూడా మార్చి నెలలో 6.7 శాతం వడ్డీ రేటుకు గృహ రుణాలపై కన్సెషనల్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ మార్చి 31తోనే ముగిసినప్పటికీ ఈ బ్యాంకు వెబ్ సైట్లో ఇంకా 6.7 శాతం వడ్డీనే చూపిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన వడ్డీరేటుతో రుణాలు వినియోగదారులు పొందాల్సి ఉంటుంది. అయితే ఎంత అనే దానిపై స్పష్టత లేదు. ఇంతకు ముందు గృహ రుణాలపై వడ్డీ రేటు 6.75 శాతముండగా.. మార్చి 4న 5 బేసిస్ పాయింట్ల తగ్గించి 6.7 శాతం వడ్డీరేటుకే రుణాలను మంజూరు చేసింది. అయితే మార్చి 31తో ఈ రాయితీ ఆఫర్ గడువు ముగిసింది.
ఈ రెండు బ్యాంకులు కాకుండా తక్కువ వడ్డీకే హోంలోన్లు అందించే బ్యాంకులు కొన్ని ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు 6.65 శాతం వడ్డీకి గృహ రుణాన్ని అందిస్తుండగా.. ఐసీఐసీఐ బ్యాంకు 6.70 శాతానికి అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 6.75 శాతం వడ్డీకి హోంలోన్ ఇస్తుంది. అయితే అన్నింటి కంటే తక్కువగా పంజాబ్ సింధ్ బ్యాంక్ 6.65 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాన్ని అందించడం గమనార్హం. పైసాబజార్ డేటా ప్రకారం ఈ ఏడాది తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందిస్తున్న కొన్ని బ్యాకులు ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.75 శాతానికి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.80 శాతం వడ్డీకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.80 శాతం వడ్డీకి, టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ 6.80 శాతం వడ్డీకి గృహరుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇవి కాకుండా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతం, కెనరా బ్యాంక్ 6.90 శాతం, యూసీఓ బ్యాంక్ 6.90 శాతం వడ్డీకి గృహరుణాలు అందిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Apr,2021 02:54PM