హైదరాబాద్: వాహనదారులూ.. బీ అలెర్ట్. కారులో వెళ్తున్నాం కదా మాస్కు ధరించనక్కర్లేదనుకునే వారికి ఢిల్లీ హైకోర్టు భారీ షాకిచ్చింది. కారులోనే కాదు, ఇతర ఏ వాహనంలో వెళ్తున్నా సరే, ఒంటరిగా ప్రయాణిస్తున్నా సరే మాస్కు పెట్టుకోవాల్సిందేనని బుధవారం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. ఒంటరిగా వాహనాల్లో వెళ్తున్నా మాస్కు పెట్టుకోలేదని జరిమానాలు విధిస్తున్నారంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు బుధవారం కీలక తీర్పును ఇచ్చింది.
కారు ఉండేది, ప్రయాణించేది పబ్లిక్ ప్లేసుల్లోనేననీ, కొవిడ్ రూల్స్ తప్పనిసరిగా వర్తిస్తాయని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నాయని గుర్తు చేసింది. ‘ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోకున్నా ఇంటి నుంచి బయటకు వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే‘ అని తీర్పునిచ్చింది. ఢిల్లీలో సౌరభ్ శర్మ అనే వ్యక్తి ప్రముఖ లాయర్. ఆయన ఇటీవల తన కారులో ఒంటరిగా వెళ్తుండగా సడన్ గా ఓ పోలీసు కారును ఆపాడు. జరిమానా విధించాడు. ‘కారులో వెళ్తూ మీరు మాస్కును ధరించలేదు. కాబట్టి రూ.500 జరిమానా చెల్లించండి‘ అని ఆ పోలీసు ఇచ్చిన రిసిప్ట్ లో ఉంది. ఒంటరిగా కారులో వెళ్తున్నా కూడా మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అని ఆ లాయర్ నిలదీశాడు. కానీ పోలీసులు మాత్రం జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆయనతోపాటు మరో ముగ్గురికి కూడా ఇదే అనుభవం ఎదురయింది.
దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సమూహంలో ఉన్నప్పుడు మాస్కు ధరించకపోతే జరిమానా విధించడంలో అర్థం ఉందనీ, ఒంటరిగా వాహనాల్లో వెళ్తున్నా కూడా జరిమానా వేయడం ఏంటని వాపోయారు. ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ కీలక తీర్పును వెల్లడించారు. కారులో వెళ్తున్నప్పటికీ మాస్కును ధరించాల్సిందే అని కీలక తీర్పును వెల్లడించారు. ‘కారు వెళ్లేది పబ్లిక్ ప్రాంతంలోకే. అయినా మీ అరోగ్యం కోసమే కదా మాస్కును పెట్టుకోమని చెప్పేది. మాస్కు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి? మీతో పాటు సామాన్య పౌరుల ఆరోగ్యం కోసమే మాస్కు తప్పనిసరి. కారులోనైనా ఏ వాహనంలోనైనా ఒంటరిగా వెళ్తున్నా సరే మాస్కు ధరించాల్సిందే‘ అని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Apr,2021 03:10PM