అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా అందులో 126 ఏకగ్రీవమయ్యాయి. మరో 8 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయాయి. మరో 11 చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన కారణంగా ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2 వేల 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఏపీలో 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అభ్యర్థులు మరణించిన 81 చోట్ల ఎన్నికలను వాయిదా వేశారు. మిగిలిన 7,220 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 18,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఎన్నిక ముగియనుంది. 2,46,71,00,2 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Apr,2021 06:47AM