ముంబై: ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కరోనా బారినపడి మృతిచెందిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానంలో స్థలం లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను దహనసంస్కారాలు నిర్వహించారు. అంబాజ్ గాయ్ పట్టణంలోని శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించాలని అనుకున్నామని ఒక అధికారి తెలిపారు. అయితే స్థానికులు అభ్యంతరం చెప్పారని, దీంతో అక్కడికి 2 కి.మీ దూరంలోని మరో శ్మశాన వాటికకు తరలించామన్నారు. స్థలం సరిపోకపోవడంతో ఒకే చితిపై 8 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm