హైదరాబాద్: సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం వంటి లక్షణాలున్నాయి. కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరస్ సోకిన వారిలో జీర్ణాశయ సమస్యలు, పొత్తి కడుపులో నొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్ తన ఉదృతిని పెంచుకుంటోందని నిపుణులు తెలిపారు. ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఈ లక్షణాలు కనిపించిన వారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడాన్ని నిపుణులు గమనించారు. అటు.. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశం.
Mon Jan 19, 2015 06:51 pm