హైదరాబాద్ : ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా పంజా విసురుతోంది. రీసెంట్‌గా వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ తనకు కొవిడ్ సోకినట్టు చెప్పుకొచ్చింది. వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నేపథ్యంలో ఆమెకు కరోనా సోకింది. నివేదా థామస్‌కు కరోనా అని నిర్ధారణ అయిన నాలుగు రోజులలో మరో హీరోయిన్ అంజలికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం. నివేధా థామస్‌తో పాటు ప్రమోషనల్ పాల్గొన్నందుకే అంజలి కరోనా బారిన పడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అంజలి ఐసోలేషన్ ఉందని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm