అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పట్ల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారు. మళ్ళీ లాక్‌డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని.. గత ఏడాది కొవిడ్ వల్ల రాష్ట్రానికిరూ.21 వేల కోట్లు ఆర్థికంగా నష్టం వచ్చిందని తెలిపారు. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రెమిడెసివీర్ కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హోం ఐసోలేషన్ ఉన్నవారి కోసం 4 లక్షల కొవిడ్ మెడిసన్ కిట్లు అందుబాటులో వున్నాయన్న అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1.4 లక్షల మందికి కరోనా వాక్సినేషన్ వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వాక్సినేషన్‌కు మన యంత్రాంగం సర్వం సమాయాత్తమై ఉందని, అయినా తగినన్ని డోసుల వాక్సిన్ అందుబాటులో లేదని సీఎంకు వివరించారు.
ప్రస్తుతానికి 3 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని సీఎంకు తెలిపారు. మన అవసరాలకు తగినన్ని డోసుల వాక్సిన్ సరఫరా కావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నివారణకు వాక్సినేషన్ ఒక్కటే మార్గమని.. దీనిపై అధికారులు మరింత చురుగ్గా దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం అర్బన్ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వాక్సినేషన్‌ను రూరల్ లో కూడా జరిగేలా చూడాలన్నారు సీఎం జగన్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Apr,2021 05:27PM