హైదరాబాద్: హైదర్‌షాకోట్‌లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విలేజ్‌లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యని అతి దారుణంగా చంపేసి భర్త బసప్ప ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతుంటే స్థానికులు పరిగెత్తి పట్టుకున్నారు. అనంతరం నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తాళం తెరిచి చూస్తే లోపల ఒంటిపై బట్టలు లేకుండా మహిళ రక్తం మడుగులో పడి ఉంది. భర్త బసప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు... మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm