హైదరాబాద్: ఇంగ్లండ్ సిరీస్ లో మొదటి వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ సర్జరీ పూర్తైంది. భుజం గాయం కారణంగా ఐపీఎల్ 14వ సీజనకు దూరమైన శ్రేయస్ కు ఈ రోజు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. మార్చి 23న పుణె వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ గాయపడ్డాడు. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లిష్ కౌంటీల్లో లాంక్షైర్ తరఫున ఆడనున్నాడు శ్రేయస్. కానీ, సర్జరీ తర్వాత నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంది. నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఇక, తనకు సర్జరీ జరిగిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు శ్రేయస్. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. " శస్త్రచికిత్స సక్సెస్ గా పూర్తైంది. గర్జించే సింహాంలా మళ్లీ జట్టులోకి వస్తా. మీ అందరి అభిమానానికి ధన్యావాదాలు " అంటూ కామెంట్ చేశాడు శ్రేయస్.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కు కెప్టెన్గా వ్యవహరించిన అయ్యర్.. గాయం కారణంగా లీగ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో రిషభ్ పంత్ను సారథిగా నియమించింది డీసీ. ఈ సారి పంత్ కెప్టెన్సీలో కప్ కొట్టాలని ఉవ్విల్లూరుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు, ఢిల్లీ యజమాన్యం పట్ల ఉదారత చూపించింది ఢిల్లీ ఫ్రాంచైజీ.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Apr,2021 06:26PM