Jan 11,2017 09:01PM-8
హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా రేపటి వరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సీబీఎస్ నుంచి కర్నూలు, కడప, చిత్తూరు,అనంతపురం, ఒంగోలు, నెల్లూరుకు, ఎల్బీ నగర్ నుంచి విజయవాడ, గుంటూరు వైపు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా 2,430 ప్రత్యేక బస్సులు వేశామని, ఏపీకి 750 ప్రత్యేక బస్సులు వేశామని ఎండీ రమణారావు తెలిపారు.