May 19,2017 09:05PM-6
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్‌లో రక్తం ఏరులై పారింది. శుక్రవారం జరిగిన మూడు ఘటనల్లో పది మంది ఆర్మీ జవాన్లతో పాటు 11 మంది పౌరులు మృతి చెందారు. పెళ్ళి బృందంతో వెళ్తున్న వాహనం రోడ్డు పక్కగా అమర్చిన బాంబుల ధాటికి పేలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు.
ఓ సైనిక పోస్ట్‌పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి బాంబు దాడుల్లో ఐదుగురు జవాన్లు చనిపోయారు. అలాగే నిద్రిస్తున్న సైనికులపై ఓ జవాన్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు విగతజీవులయ్యారు. వారి ఆయుధాలు తీసుకుని అతడు పరారయ్యాడు.