Nov 22,2017 01:11PM-1
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నొయిడా ప్రాంతంలో ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్ (జెపి) అసోసియేట్స్ కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ (జైపీ ఇన్ఫ్రాటెక్ మాతృ సంస్థ) స్వతంత్ర డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఎలాంటి వ్యక్తిగత ఆస్తులను బదిలి చేయడానికి వీల్లేదని ఆదేశించింది. గృహ యజమానుల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రమోటర్లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.