Jan 17,2018 03:01PM-7
హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో సినీ విమర్శకుడు కత్తి మహేశ్ పేరు ఈ మధ్య ప్రముఖంగా వినిపిస్తోంది. కత్తి మహేశ్ ఈరోజు చంచల్‌గూడ జైల్లో మందకృష్ణను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. ఎమ్మార్పీఎస్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కత్తి మహేష్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, గుజరాత్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన దళిత నేత జిగ్నేష్ మేవానిని కూడా కత్తి మహేశ్ కలిశారు. జిగ్నేష్‌తో కలిసి నడుస్తూ తన మద్దతు ప్రకటించాడు. జిగ్నేష్‌ను ఆదర్శంగా తీసుకుని దళిత సామాజిక వర్గానికి చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని గతంలో కూడా కత్తి మహేశ్ చెప్పాడు.