Jan 19,2018 01:01PM-6
వరంగల్: కలెక్టరేట్‌లో అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ కాకతీయ పనులపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మిషన్ కాకతీయ పనులు వేగవంతం చేయాలని, నాలుగోదశ కాకతీయ పనులను పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలిచేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. మిషన్‌కాకతీయ పనులపై జిల్లా కలెక్టర్లు వారానికోసారి సమీక్ష జరపాలని సూచించారు.