హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో విళంబినామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేదపండితుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా విరాజిల్లుతుందని, సుసంపన్నంగా, సిరిసంపదలతో తులతూగుతుందని అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేలకోట్లు వెళ్తున్నాయని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉన్నారని సీఎం చెప్పారు. రాష్ట్రంలో పోలీసు శాఖ సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. నేతలు టికెట్లు సంపాదించుకోవాలంటే ప్రజల్లో ఉండాలని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, హైదరాబాద్‌లో ఉండొద్దని, ప్రజల్లో ఉంటే గెలుపు వారిదేనని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ దేవ భూమి కలిగిన రాష్ట్రని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం గొప్పగా నిర్వహిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా చిరునవ్వుతో బతకాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Mar 18,2018 01:03PM-7