Mar 20,2018 11:03AM-7
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో ఇవాళ టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ర్టాలకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఒకే దేశం, ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు మొదలైన క్షణం నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు.