Mar 20,2018 07:03PM-6
హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ్యత్వాల రద్దు, కాంగ్రెస్ సభ్యులపై చర్యలను ఖండిస్తూ.. ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ్యత్వాల రద్దు అశంపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో...సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేతలు మావేశమయ్యారు. తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ రేపు ఎన్నికల కమిషన్‌ను కలవాలని నిర్ణయించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓట వేసే అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి, సంపత్ ఈసీని కోరనున్నారు.