Mar 20,2018 07:03PM-6
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులకు నేడు ఇవాల్సిన విందును రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు రద్దు చేశారు. గత 12 రోజులుగా సభ సక్రమంగా సాగనందుకే విందును రద్దు చేసినట్లుగా సమాచారం. విందు ఏర్పాట్లు గత వారమే పూర్తయ్యాయి. విందు గురించిన సమాచారాన్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సభలో ప్రతిపక్ష నాయకుడు, సభ్యులతో చర్చించి విందుకు రావాల్సిందిగా కోరారు. కాగా ప్రతిపక్ష సభ్యుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో సమావేశాలు సాగని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ సభ్యులకు ఇచ్చే విందును రద్దు చేశారు.