Apr 16,2018 09:04PM-7
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతోందని నిజామబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని ఆమె చెప్పారు. జగిత్యాల జిల్లా, కోరుట్లలో కవిత పర్యటించారు. ఆమెకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.