Jun 18,2018 04:06PM-7
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కలిశారు. మహేశ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ చిత్రం షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లారు. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన త్రివేంద్రసింగ్ మహేశ్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలుత డెహ్రాడూన్‌లో కాలేజీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.