Jun 19,2018 05:06PM-6
జమ్మూకశ్మీర్: ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవానుకు గాయలైన ఘటన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని ట్రాల్ సెక్టార్ లో చోటుచేసుకుంది. ట్రాల్ సెక్టార్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జవానుకు గాయాలయ్యాయి. ఓ ఇంట్లో దాగి ఉన్న టెర్రరిస్టును సైన్యం చుట్టుముట్టింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.