Jun 20,2018 08:06AM-7
హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా గుర్తిస్తూ ఇండియా టుడే సంస్థ తెలంగాణకు ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయన బృందానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.