హైదరాబాద్: నగరంలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. పాలిటెక్నిక్ చదవుతున్న సనా తన తల్లిదండ్రుల కళ్ల ముందే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపిగుంట గ్రామానికి చెందిన మహ్మద్ సనా ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. సనా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు హాస్టల్‌కు వచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన సనాను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Jun 20,2018 10:06AM-7