Jun 20,2018 12:06PM-7
హైదరాబాద్ : తమిళనాడు ఆర్‌కె నగర్‌లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన టిటివి దినకరన్ ఎన్నిక చెల్లుబాటవుతుందని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పంది. ఉప ఎన్నిక సందర్భంగా దినకరన్ ఓటర్లకు నగదు పంచిపెట్టి ప్రలోభపెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ఎన్నిక చెల్లుబాటు కాకుండా చూడాలంటూ కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దినకరన్ ఎన్నిక చెల్లుబాటవుతుందని తీర్పు చెప్పింది.