Jun 21,2018 01:06PM-7
హైదరాబాద్ : 19వ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో జాతీయ సదస్సు నగరంలో జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతు.. ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీని ఉపయోగించటంలో ముందున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఫింగర్ ప్రింట్స్ సదస్సు జరగటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఫింగర్ ప్రింట్స్ తో 858 కేసులను ఛేదించామన్నారు. 480 పాత కేసులు, 42 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించామని మహేదర్ రెడ్డి తెలిపారు. పాపిలాన్ టెక్నాలజీ ద్వారా 7వేల మవంది పాతనేరస్తులను గుర్తించామన్నారు. రూ7.2 కోట్ల ఆస్తులను ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన ఆధారాలతో స్వాధీనం చేసుకున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కాగా మోనాలీసా పెయింటింగ్ చోరీ కేసు పరిష్కారం కూడా ఫింగర్ ప్రింట్స్ ద్వారానే జరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డైరెక్టర్ తెలిపారు.