Jul 18,2018 10:07AM-7
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని విపక్షాలను కోరారు. పెండింగ్ బిల్లులతో పాటు కొత్త బిల్లుల ఆమోదానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభా సమావేశాల సజావుకు సభ్యులు సహకరించాలన్నారు.