Jul 20,2018 02:07PM-7
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వాగ్వాదంతో వాయిదా పడిన లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. సభ్యులు మర్యాదకర భాష వాడాలని ఈ సందర్భంగా స్పీకర్ సూచనలు చేశారు. ఇతరులపై ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు చూపాలని సభ్యులకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. రఫెల్ ఒప్పందం, అమిత్‌షా కుమారుడిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతూ సభలో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే.