Jul 20,2018 03:07PM-7
హైదరాబాద్ : రాఫెల్ డీల్ అంశాలు రహస్యంగా ఉంచాలని ఫ్రాన్స్‌తో ఒప్పందం ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాహుల్‌కు, ఫ్రాన్స్ అధ్యక్షుడికి మధ్య ఏం చర్చ జరిగిందో తనకు తెలియదని ఆమె చెప్పారు. ఒప్పందం వివరాలు బైటపెట్టలేమిన ఫ్రాన్స్ అధ్యక్షుడే స్వయంగా చెప్పారని ఆమె అన్నారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ రాఫెల్ డీల్ విషయాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రస్తావించడంతో ఆమె వివరణ ఇచ్చారు.