Jul 20,2018 05:07PM-7
హైదరాబాద్: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై మై హోమ్ అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం కేసును నిలుపుదల చేసింది. హైటెక్ సిటీ వద్ద భూముల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, ఈ కేటాయింపుల్లో మై హోమ్ అధినేత రామేశ్వరరావుకి లబ్ధి చేకూరిందని రేవంత్‌రెడ్డి చాలాసార్లు బహిరంగంగానే విమర్శించారు. దీంతో రామేశ్వరరావు... నాంపల్లి కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగిందంటూ రూ. 90 కోట్లు చెల్లించాలని దావాలో పేర్కొన్నారు. దీంతో రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన కోర్టు నిలుపుదల చేస్తూ ఆదేశించింది.