Jul 20,2018 05:07PM-7
భద్రాద్రి కొత్తగూడెం : భారీ వర్షాల కారణంగా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నీటి మట్టం 407 అడుగుల సామర్థ్యానికి మించడంతో ఇవాళ సాయంత్రం.. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేశారు. దిగువకు 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.