చెన్నై: కావేరీ నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతైన ఘటన సేలంలోని రెడ్డియూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన వివరాల ప్రకారం, శరవణన్, ఆయన భార్య మైథిలి, కుమారుడు హరిహరన్ (9) తమ బంధువైన థనుశ్రీని కలుసుకునేందుకు రెడ్డియూర్ వచ్చారు. ఈరోడ్‌లోని పెరుందురై మీదుగా వారు ఆదివారం ఉదయం రెడ్డియూర్ చేరుకుని థనుశ్రీ ఇంటికి సమీపంలోని కావేరీ జల్లాల్లో స్నానానికి వెళ్లారు. తమతో పాటు రేవణ్ణ (15), వాణిశ్రీ (20)లను వెంటబెట్టుకుని వెళ్లారు. ప్రవాహ ఉధృతికి వారు నీటిలో కొట్టుకుపోగా, ఈత తెలియడంతో థనూశ్రీ ఒడ్డుకు చేరుకుని ప్రమాదం నుంచి బయటపడింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది, పోలీసు శాఖ రంగంలోకి దిగి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా, బయట నుంచి నీటి ప్రవాహం వచ్చి చేరుతుడంతో కావేరీ నదీ పరిహారక ప్రాంతంలో ప్రజలకు హెచ్చరికలు జారీచేశామని, అయినప్పటికీ వాటిని ఖాతర చేయకుండా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని సేలం జిల్లా కలక్టర్ తెలిపారు. వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సేలం, ధర్మపురి జిల్లాల్లో గతవారం ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు
Jul 22,2018 03:07PM-7