Aug 13,2018 04:08PM-7
లక్నో: నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై సమాజ్‌వాది పార్టీ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ ఇచ్చే నినాదాలు, ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అధికారిక పత్రాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఆవిడ.. దానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు.
ఈ భూమ్మీద ఇనిస్టిట్యూట్ లేదు, ఫైల్‌లో ఉంది.
ఈ భూమ్మీద స్మార్ట్ సిటీ లేదు, ఫైల్‌లో ఉంది.
ఈ భూమ్మీద బుల్లెట్ ట్రైన్ లేదు, ఫైల్‌లో ఉంది.
ఈ భూమ్మీద మరుగుదొడ్డి లేదు, ఫైల్‌లో ఉంది.
ఈ భూమ్మీద 2 కోట్ల ఉద్యోగాలు లేవు, ఫైల్‌లో ఉన్నాయి.
ఈ భూమ్మీద వికాస్ (అభివృద్ధి) లేదు, ఫైల్‌లో ఉంది.
ఈ భూమ్మీద అచ్చే దిన్ (మంచి రోజులు) లేవు. ఫైల్‌లో ఉన్నాయి