Aug 19,2018 07:08AM-6
హైదరాబాద్: ఆటో ఫైనాన్షియర్ల వేధింపులను శాశ్వతంగా అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూరారానికి చెందిన షేక్ అజ్‌హరుల్లా ఆటో ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేదని అతని ఇంటికి తాళం వేసిన శ్రీనకోడా ఆటో ఫైనాన్షియర్స్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుడు సంజీవరెడ్డినగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 16న ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ నాయకులు ఎ.సత్తిరెడ్డి, ఎం.ఎ.ఖదీర్, మహ్మద్ లతీఫ్, మీర్జా రఫతుల్లాబేగ్, మహ్మద్ ఆజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.