Aug 19,2018 03:08PM-7
వరంగల్: ఇంటికన్నె -నెక్కొండ రైల్వేస్టేషన్ మధ్య దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్నరైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరం చిద్రమై,శరీర భాగాలు తెగిపడిపోవడంతో గుర్తుపట్టుటకు వీలులేని విధంగా ట్రాక్ మధ్యలో చనిపోయి ఉన్నాడు. మృతుడు 5.4ఎత్తు, ఎరుపు రంగు, గుండ్రని ముఖము, ఛాతిపై పుట్టుమచ్చ, కాషాయం రంగు ప్యాంటు, పెసర కలర్ ఫుల్ షర్టు, మల్టీ కలర్ టీ షర్టు ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుని వద్ద యూపీసీ 73282800 రైల్వే జనరల్ టిక్కెట్ ఖమ్మం- ఇంటికన్నె వరకు ఉంది. మృతుని వివరాలు తెలుసుకొనుటకు రైల్వే పోలీసులు ఎంజియం మార్చూరికి శవాన్ని తరలించారు.