Aug 21,2018 07:08PM-6
హైదరాబాద్: ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్, మానిటరింగ్-టాస్క్ విధానాన్ని జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టింది. స్మార్ట్ ఇంజనీరింగ్ టాస్క్ యాప్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టాస్క్ యాప్ ద్వారా ఇంజినీరింగ్ పనులు ఆన్‌లైన్ ద్వారా రికార్డింగ్ పర్యవేక్షణ జరగనుంది. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు టాస్క్ ద్వారా పనుల నిర్వహణ, ఇంజినీరింగ్ పనులు ఆన్‌లైన్‌లో రికార్డు చేయడం, పర్యవేక్షించేందుకు అవకాశం కలుగుతుంది. పనుల్లో డబుల్ నమోదు నివారణతో పాటు పనులన్నింటినీ జియోట్యాగింగ్‌కు చేసేందుకు వీలు. నావిగేషన్‌తో ఇంటిగ్రేట్ చేసిన ఈ టాస్క్ యాప్‌తో పనుల ప్రదేశంలోనే స్వయంగా నమోదుకు అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ యాప్ ద్వారా ఏడాదికి 10 వేల పనులు ఆన్‌లైన్‌లో రికార్డు చేయవచ్చు.